TS News: కొత్త జిల్లాలు, జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన: మమత

తెలంగాణలో ఉద్యోగుల వర్గీకరణ, బదిలీల విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ భేటీ ముగిసింది. టీఎన్జీవో, టీజీవో నేతలతో సీఎస్‌ వివిధ అంశాలపై చర్చించారు. ..

Published : 05 Dec 2021 18:52 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగుల వర్గీకరణ, బదిలీల విధివిధానాలపై ఉద్యోగ సంఘాలతో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ భేటీ ముగిసింది. టీఎన్జీవో, టీజీవో నేతలతో సీఎస్‌ వివిధ అంశాలపై చర్చించారు. ఉద్యోగుల వర్గీకరణపై త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి. సమావేశం ముగిసిన తర్వాత టీజీవో అధ్యక్షురాలు మమత మీడియాతో మాట్లాడుతూ.. కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారమే ఉద్యోగుల విభజన ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యోగులకు నష్టం జరగకుండా కొత్త జిల్లాలు, కొత్త జోన్ల ప్రకారం విభజన చేయాలని కోరామని తెలిపారు. సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తూ ఉద్యోగుల కేటాయింపు ఉంటుందన్నారు. ఉద్యోగుల బదిలీల కోసం ప్రత్యేకంగా ఆయా జిల్లాల్లో కమిటీలు ఏర్పాటు కానున్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం రూపొందించిన గైడ్‌లైన్స్‌ బాగున్నాయని తెలిపారు. క్లిష్టమైన సమస్యను సీఎం సులభంగా పరిష్కరించారని చెప్పారు. నెలలోపే ఉద్యోగుల ఐచ్ఛికాల ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. బదిలీ ఆప్షన్ల ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో విధానంలోనే ఉంటుందన్నారు. ఏ జిల్లా ఉద్యోగిని ఆ జిల్లాలోనే సర్దుబాటు చేయాలని కోరామని చెప్పారు. ఉద్యోగుల ప్రత్యేక పరిస్థితులును కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని