Published : 14 Jul 2021 23:46 IST

Viral: చాకచక్యంగా పామును పట్టిన మహిళ 

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా సర్పాలంటేనే ప్రతి ఒక్కరూ ఆమడ దూరం పరిగెడతారు. అలాంటిది ఓ మహిళ ఎలాంటి బెరుకూ లేకుండా క్షణాల్లో పామును పట్టుకుని సీసాలో బంధించింది. కరీంనగర్లోని మంకమ్మతోటలో మంగళవారం రాత్రి ఓ నాగుపాము పలువురి ఇళ్లలోకి దూరి హడలెత్తించింది. స్థానిక కార్పొరేటర్‌ జితేందర్‌ పాములు పట్టేవారికి సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న షబానా విద్యుత్‌ దీపాలు ఆర్పేసి సర్పం శబ్దాన్ని పసిగట్టి క్షణాల్లో దాన్ని పట్టుకుని అబ్బురపరిచారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.


Read latest Telangana News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని