TS TET: తెలంగాణ టెట్‌ అభ్యర్థులు అలర్ట్‌.. హాల్‌టికెట్లు వచ్చేశాయ్‌: కన్వీనర్‌

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల కన్వీనర్‌ వెల్లడించారు. tstet.cgg.gov.inలో హాల్ టికెట్లను అప్‌లోడ్‌

Published : 06 Jun 2022 15:01 IST

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) హాల్ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు పరీక్షల కన్వీనర్‌ వెల్లడించారు. tstet.cgg.gov.in లో హాల్ టికెట్లను అప్‌లోడ్‌ చేసినట్లు చెప్పారు. ఈనెల 12న టెట్ జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్ వన్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 జరగనున్నాయి. హాల్ టికెట్‌లో అభ్యర్థి పేరు, తండ్రి పేరు, తల్లి పేరులో అక్షర దోషాలు, కులం, లింగం, దివ్యాంగులు.. తదితర వివరాల్లో పొరపాటు ఉన్నట్లయితే పరీక్ష కేంద్రం వద్ద నామినల్ రోల్‌లో మార్చుకోవాలని కన్వీనర్ పేర్కొన్నారు. హాల్‌ టికెట్‌పైన ఫొటో, సంతకం సరిగా లేకపోయినా.. పూర్తిగా లేకపోయినా.. తాజాగా దిగిన ఫొటోను అతికించి గెజిటెడ్ అధికారి సంతకం చేయించి డీఈఓను సంప్రదించాలని సూచించారు. టెట్‌కు సుమారు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసే సమయంలో ఏమైనా సమస్యలు తలెత్తితే రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి కార్యాలయంలో లేదా 040 23120340, 040-23120433 ఫోన్ నంబర్లను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు