Hyderabad News: వనస్థలిపురంలో దారుణం.. గుర్తు తెలియని బాలుడి తల లభ్యం

వనస్థలిపురం పరిధిలోని సహారాలో దారుణం వెలుగు చూసింది. గుర్తు తెలియని బాలుడి తల కలకలం రేపింది. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు.

Published : 14 Mar 2022 02:03 IST

హైదరాబాద్‌: వనస్థలిపురం పరిధిలోని సహారాలో దారుణం వెలుగు చూసింది. గుర్తు తెలియని బాలుడి తల కలకలం రేపింది. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

ఎల్బీనగర్‌కు చెందిన కార్తీక్‌ ఆదివారం ఉదయం మన్సూరాబాద్‌లోని సహారా రోడ్డులో ఓ పాల దుకాణంలో కూర్చుని ఉండగా.. బాలుడి తలను కుక్క నోటకరుచుకుని వెళ్లడం గమనించాడు. వెంటనే కుక్కను వెంబడించగా... బాలుడి తలను సహారా ప్రహరీగోడ సమీపంలోని పొదల్లో వదిలేసి కుక్క పారిపోయింది. సమాచారం అందుకున్న వనస్థలిపురం పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని బాలుడి తలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని