TS news : సంగారెడ్డిలో రూ.2కోట్ల విలువైన గంజాయి పట్టివేత

సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రూ.2 కోట్ల విలువైన ఎండుగంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు సుమారు వెయ్యి కిలోల ఎండు గంజాయిని..

Published : 27 Jan 2022 01:25 IST

సదాశివపేట : సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో రూ.2 కోట్ల విలువైన ఎండుగంజాయిని తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజమహేంద్రవరం నుంచి మహారాష్ట్రలోని నాందేడ్‌కు సుమారు వెయ్యి కిలోల ఎండు గంజాయిని తరలిస్తున్నారన్న సమాచారం మేరకు సదాశివపేట మండలం నందికంది వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు. షేక్‌ సలీం, అజీజ్‌ఖాన్‌ ను అదుపులోకి తీసుకొని లారీని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రమణకుమార్‌ వెల్లడించారు. పట్టుబడిన లారీలో 500 ప్యాకెట్లు.. ఒక్కోటి 2 కిలోల చొప్పున ఉన్నట్లు తెలిపారు. గంజాయిని తరలిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు  కోహిర్‌ మండలం పీచేర్యాగడిలోనూ పోలీసులు భారీగా ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విశాఖ మన్యం నుంచి ముంబయికి గంజాయిని తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని