TS News: పొరపాట్లు సవరించి.. ఉత్తర్వులు జారీ చేయండి: టీఎన్జీవో నేతలు

ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియలో పరస్పర బదిలీలు, భార్యాభర్తల కేసులకు అవకాశం ఇచ్చిన బదిలీలు చేపట్టాలని టీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది...

Published : 19 Jan 2022 21:08 IST

హైదరాబాద్‌: ఉద్యోగుల విభజన, కేటాయింపుల ప్రక్రియలో పరస్పర బదిలీలు, భార్యాభర్తల కేసులకు అవకాశం ఇచ్చిన బదిలీలు చేపట్టాలని టీఎన్జీవో సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈమేరకు టీఎన్జీవో నేతలు సచివాలయంలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఉద్యోగులకు 3 డీఏ బకాయిలు చెల్లించేందుకు అనుమతించిన సీఎం కేసీఆర్‌కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యోగుల విభజనలో భార్యాభర్తల కేసులు, పరస్పర బదిలీల కేసులు, సీనియారిటీలో జరిగిన పొరపాట్లను సవరించడంతో పాటు అప్పీళ్లను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈమేరకు ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని సీఎస్‌ను కోరారు. త్వరలోనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉత్తర్వులు జారీ చేస్తామని సీఎస్‌ హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. రేపు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశముందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని