TS News: వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమం:సీఎం కేసీఆర్‌

ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో

Updated : 17 Jan 2022 18:18 IST

హైదరాబాద్‌: ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఆంగ్ల మాధ్యమం, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ కళాశాల్లో ఫీజుల నియంత్రణపై కొత్త చట్టం తీసుకురావాలని కేబినెట్‌ తీర్మానించింది. ఆంగ్ల మాధ్యమం, ఫీజుల నియంత్రణపై కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఈ రెండు అంశాలపై పూర్తి స్థాయిలో అధ్యయనం చేసి విధివిధానాల రూపకల్పనకు మంత్రి వర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన ఏర్పాటైన కమిటీలో మంత్రులు  కేటీఆర్‌, హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, నిరంజన్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్‌, శ్రీనివాస్‌గౌడ్‌, జగదీశ్‌రెడ్డి సభ్యులుగా ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మౌలిక వసతుల కోసం ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం కింద రూ.7,289 కోట్లు కేటాయించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని