
Published : 26 Aug 2021 13:04 IST
TS High Court: నాలుగేళ్లు దాటినా నివేదిక ఎందుకివ్వడం లేదు?: తెలంగాణ హైకోర్టు
హైదరాబాద్: కోకాపేట భూముల వేలం వ్యవహారంలో జీవో నంబర్ 111పై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. నాలుగేళ్లు దాటినా ఉన్నతస్థాయి కమిటీ నివేదిక ఎందుకు ఇవ్వడం లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. కరోనా, తదితర కారణాలతో ఆలస్యమైందని ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ రామచంద్రరావు సమాధానమిచ్చారు.
అనంతరం హైకోర్టు స్పందిస్తూ సెప్టెంబర్ 13లోపు ఉన్నతస్థాయి కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. నివేదిక సమర్పించకపోతే ఆరోజుతో కమిటీ రద్దు చేస్తామని హెచ్చరించింది. ఈపీటీఆర్ఐ నివేదికపై కూడా అభిప్రాయాలు తెలపాలని కమిటీకి ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నివేదికను వెబ్సైట్లో పెట్టాలని కమిటీని హైకోర్టు ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను అక్టోబర్ 4కి వాయిదా వేసింది.
ఇవీ చదవండి
Tags :