TSRTC: వాటర్‌ బాటిల్‌ డిజైన్ సూచించండి.. ప్రైజ్ మనీ గెలుచుకోండి: టీఎస్‌ఆర్టీసీ

మంచి వాటర్ బాటిల్ డిజైన్‌ సూచించండి.. ప్రైజ్ మనీ గెలుచుకోండని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఓ ప్రకటన చేసింది. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది.

Published : 28 May 2022 18:09 IST

హైదరాబాద్: మంచి వాటర్ బాటిల్ డిజైన్‌ సూచించండి.. ప్రైజ్ మనీ గెలుచుకోండని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (టీఎస్‌ఆర్టీసీ) ఓ ప్రకటన చేసింది. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లను తయారు చేసి, విక్రయించేందుకు టీఎస్‌ఆర్టీసీ సిద్ధమైంది. ఈ విషయాన్ని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విటర్ ద్వారా తెలియజేశారు. వాటర్ బాటిళ్లకు మంచి టైటిల్, డిజైన్ సూచించాలని ట్విటర్‌ వేదికగా కోరారు. ఎవరైతే బెస్ట్ డిజైన్ పంపుతారో వారికి ప్రైజ్ ఇస్తామని చెప్పారు. ఆర్టీసీలో తీసుకొస్తున్న మార్పులకు ప్రయాణికులు తోడ్పాటునివ్వాలని, తద్వారా చరిత్రలో నిలిచిపోవాలని సజ్జనార్ వెల్లడించారు. ప్రయాణికుల కోసం 500 ఎంఎల్, 1 లీటర్ వాటర్ బాటిళ్ల ఉత్పత్తిని ప్రారంభించబోతున్నట్టు  తెలిపారు. ప్రజలు తమ సూచనలను ఆర్టీసీ వాట్సాప్ నంబర్ 94409-70000కి పంపాలని సజ్జనార్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని