TSRTC: పల్లె వెలుగు బస్సు టికెట్‌ ఛార్జీల్లో రౌండప్‌ విధానం

తెలంగాణలోని పల్లె వెలుగు బస్సు టికెట్‌ ధరల్లో రౌండప్‌ విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చింది

Updated : 01 Apr 2022 16:14 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని పల్లె వెలుగు బస్సు టికెట్‌ ధరల్లో రౌండప్‌ విధానాన్ని ఆర్టీసీ అమల్లోకి తీసుకొచ్చింది. చిల్లర సమస్య కారణంగా టికెట్‌ ఛార్జీలను రౌండప్‌ చేసింది. రూ.12 ఛార్జీ ఉన్న చోట టికెట్‌ ధర రూ.10గా, రూ.13, రూ.14 ఉన్న టికెట్‌ ఛార్జీని రూ.15గా చేస్తూ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. 80 కి.మీ దూరానికి రూ.67 ఉన్న ఛార్జీని రూ.65గా నిర్ధారించింది. అలాగే టోల్‌ప్లాజాల వద్ద ఆర్డినరీకి రూ.1, హైటెక్‌, ఏసీ బస్సులకు రూ.2 వసూలు చేయనుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని