Telangana News: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవం

రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికను...

Published : 23 May 2022 20:12 IST

హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడిగా వద్దిరాజు రవిచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ ఉపఎన్నికకు నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగియడంతో వద్దిరాజు రవిచంద్ర ఎన్నికను ఎన్నికల కమిషన్ అధికారికంగా ప్రకటించింది. అసెంబ్లీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి నుంచి ఎన్నిక ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. ఎమ్మెల్సీగా ఉన్న బండ ప్రకాశ్‌ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన స్థానానికి ఉపఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. బండ ప్రకాష్ స్థానంలో రవి 2024 ఏప్రిల్ వరకు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగనున్నారు. తనకు అవకాశం కల్పించినందుకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కి వద్దిరాజు కృతజ్ఞతలు తెలిపారు. జూన్‌లో పదవీకాలం ముగియనున్న డీఎస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు స్థానాల భర్తీ కోసం రేపు నోటిఫికేషన్ విడుదల కానుంది. తెరాస అభ్యర్థులు బండి పార్థసారథిరెడ్డి, దామోదర్ రావు బుధవారం ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేయనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని