Suicide: సెల్‌ఫోన్‌ తిరిగివ్వలేదని ఒకరు.. పరిహారం చెల్లించలేక మరొకరు

ఒక సెల్ ఫోన్ ఇద్దరి ప్రాణాలు బలిగొంది. స్నేహితుడు తన సెల్‌ఫోన్‌ దొంగిలించి తిరిగివ్వలేదని ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా..

Published : 17 Apr 2022 14:27 IST

బీర్కూర్‌: ఒక సెల్ ఫోన్ ఇద్దరి ప్రాణాలు బలిగొంది. స్నేహితుడు తన సెల్‌ఫోన్‌ దొంగిలించి తిరిగివ్వలేదని ఒకరు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోగా.. ఆ మృతికి కారణమంటూ గ్రామ పెద్దలు విధించిన పరిహారం చెల్లించలేక స్నేహితుడు సైతం ఉరేసుకుని చనిపోయాడు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం భైరాపూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..స్నేహితుడు తన ఫోన్ దొంగిలించి ఇవ్వలేదనే మనస్తాపంతో నీరడి మహేశ్‌(30) ఈ నెల 12న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. నిజామాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ నెల 13న సాయంత్రం మహేష్ మృతి చెందాడు.

ఈ నెల 14న తన కుమారుడి ఆత్మహత్యకు సాయిలు కారణమని అతని ఇంటి ముందు మృత దేహంతో మహేష్ బంధువులు ఆందోళన చేశారు. గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు జోక్యం చేసుకుని మహేష్ కుటుంబానికి రూ.లక్ష పరిహారం చెల్లించాలని సాయిలు కుటుంబానికి సూచించారు. అయితే పెద్దలు విధించిన పరిహారం చెల్లించలేక నిన్న ఎడపల్లి మండలం బ్రహ్మణపల్లి సమీపంలోని అడవిలో నిన్న రాత్రి ఉరేసుకుని సాయిలు(27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని