Air India: ప్రభుత్వానికి ఎయిరిండియా టాటా

విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం గురువారం టాటా గ్రూప్‌నకు అధికారికంగా అప్పగించింది. దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్‌ ఆధీనంలోకి రావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు.

Updated : 28 Jan 2022 05:37 IST

విమానయాన సంస్థ ఎయిరిండియాను ప్రభుత్వం గురువారం టాటా గ్రూప్‌నకు అధికారికంగా అప్పగించింది. దిల్లీలో ఈ కార్యక్రమం జరిగింది. ఎయిరిండియా మళ్లీ టాటా గ్రూప్‌ ఆధీనంలోకి రావడం ఎంతో సంతోషం కలిగిస్తోందని టాటా సన్స్‌ ఛైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ తెలిపారు. ‘ఎయిరిండియాను టాటా సన్స్‌ అనుబంధ కంపెనీ అయిన టాలెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అప్పగించాం. ఇక నుంచి ఆ సంస్థే యజమాని’ అని పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగ కార్యదర్శి తుహిన్‌ కాంత పాండే ఈ సందర్భంగా తెలిపారు. 1932లో టాటా గ్రూప్‌ ఎయిరిండియాను స్థాపించగా.. స్వాతంత్య్రం వచ్చాక 1953లో అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ సంస్థను జాతీయీకరించారు. సుమారు 69 ఏళ్ల తర్వాత ఎయిరిండియా సొంతగూటికి చేరినట్లయ్యింది.
 

పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని