సగం నిండిన సింగూరు ప్రాజెక్టు

మెతుకు సీమ వరప్రదాయిని సింగూరు జలాశయం సగం నిండింది. రెండేళ్లుగా కనీస ప్రవాహం లేక బీటలు వారిన ఈ జలాశయానికి ఈ ఏడాది ప్రవాహం వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1717.93 అడుగులకుగాను...

Published : 19 Sep 2020 04:29 IST

ఉరకలెత్తుతున్న కృష్ణాగోదావరులు
నిండుకుండల్లా జలాశయాలు

ఈనాడు, హైదరాబాద్‌, న్యూస్‌టుడే యంత్రాంగం: మెతుకు సీమ వరప్రదాయిని సింగూరు జలాశయం సగం నిండింది. రెండేళ్లుగా కనీస ప్రవాహం లేక బీటలు వారిన ఈ జలాశయానికి ఈ ఏడాది ప్రవాహం వచ్చి చేరుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం 1717.93 అడుగులకుగాను ప్రస్తుతం 1703.90 అడుగులకు చేరింది. జలాశయం నిల్వ సామర్థ్యం 29.91 టీఎంసీలకు ప్రస్తుతం 14.17 టీఎంసీలున్నాయి. గతేడాది ఇదే సమయానికి ఈ జలాశయంలో 0.41 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం జలాశయంలో జలసవ్వడి పెరగడంతో దిగువ ప్రాంతాల్లో భూగర్భ జలమట్టాలు పెరుగుతున్నాయి. వ్యవసాయ బోర్లు కూడా తేరుకుంటున్నాయి. సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో తాగునీటికి కూడా ఇబ్బందులు తప్పినట్లేనని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నిజాంసాగర్‌లో నిల్వ 4.32 టీఎంసీలకు చేరుకుంది. గోదావరి పరీవాహకంలోని జలాశయాలు కళకళలాడుతున్నాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతంగా వచ్చి చేరుతోంది. రాబోయే 4 రోజుల వరకు వరద ఉద్ధృతి కొనసాగనుండటంతో ముందు జాగ్రత్తగా మొత్తం 40 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్లు ఎస్సారెస్పీ ఈఈ రామారావు తెలిపారు. శుక్రవారం సాయంత్రం సమయానికి వివిధ ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఇలా ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని