భైంసాలో చెలరేగిన అల్లర్లు

నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి.

Published : 08 Mar 2021 02:25 IST

  ఓ ఎస్సై, కానిస్టేబుల్‌ సహా పలువురికి గాయాలు
  ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి

భైంసా పట్టణం, న్యూస్‌టుడే: నిర్మల్‌ జిల్లా భైంసా పట్టణంలో అల్లర్లు చెలరేగాయి. పట్టణంలోని జుల్ఫేకార్‌గల్లీ, కుభీరు రహదారి, గణేశ్‌నగర్‌, మేదరిగల్లీతోపాటు బస్టాండు ప్రాంతాల్లో ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో ఇరువర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నాయి. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. ఇందులో ఓ ఎస్సై, కానిస్టేబుల్‌తో పాటు ఇద్దరు ఎలక్ట్రానిక్‌ మీడియాకు చెందిన వారున్నారు. వీరిలో కొందరిని స్థానిక ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయిస్తుండగా.. తీవ్రంగా గాయపడ్డ మరికొందరిని నిజామాబాద్‌కు, హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనలో పలు వాహనాలు, ప్రయాణ ప్రాంగణం ఎదుట దుకాణాలు దహనమయ్యాయి. డీఎస్పీ నర్సింగ్‌రావు ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రప్పించారు. గుమిగూడిన వారందరినీ చెదరగొట్టారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చారు. జిల్లా ఇన్‌ఛార్జి ఎస్పీ విశ్వ వారియర్‌ భైంసా చేరుకొని సమీక్షించారు. ఏడాది క్రితం కూడా ఇక్కడ గొడవలు జరిగిన విషయం విదితమే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని