ఏపీలో కొత్త జిల్లాలపై మళ్లీ కదలిక?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైంది. వైకాపా లోక్‌సభ సభ్యులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల అంశం మరోమారు తెరపైకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి.

Published : 28 Nov 2021 05:04 IST

వైకాపా ఎంపీలతో సీఎం జగన్‌ వ్యాఖ్యలతో మళ్లీ తెరపైకి!

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుపై మళ్లీ చర్చ మొదలైంది. వైకాపా లోక్‌సభ సభ్యులతో సమావేశమైనప్పుడు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో కొత్త జిల్లాల అంశం మరోమారు తెరపైకొచ్చింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాలు ఉన్నాయి. ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ప్రకటిస్తామని.. ఇవి 25 లేదా 26 ఉంటాయని గతేడాది ఆగస్టులోనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ అధికారులు కొత్త జిల్లాల ఏర్పాటు చర్యలను తాత్కాలికంగా పక్కనపెట్టారు. మరోవైపు ఈ ఏడాది మార్చిలో జనగణన పూర్తయ్యే వరకూ దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక సరిహద్దులను మార్చడానికి వీల్లేదని భారత రిజిస్ట్రార్‌ కార్యాలయం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో వైకాపా పార్లమెంటు సభ్యులతో శుక్రవారం జరిగిన సమావేశంలో కొత్తగా జిల్లాల ఏర్పాటుతో కేంద్రం నుంచి నిధులు వస్తాయన్న దానిపై చర్చ జరిగింది. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు జగన్‌ పేర్కొనడంతో ఈ అంశం మరోమారు చర్చల్లో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని