Published : 28/11/2021 05:04 IST

ధాన్యం కొనుగోళ్లు నిలిపివేయలేదు!

ఈనాడు, దిల్లీ, హైదరాబాద్‌: తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతాయని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ తెలిపింది. రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళ్లను కేంద్రం నిలిపివేసిందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఆ శాఖ వివరణ ఇచ్చింది. ఆ ప్రచారంలో నిజంలేదని శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, భారత ఆహార సంస్థ మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం కనీస మద్దతు ధరతో, ధాన్యం కొంటామని కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ శాఖ అధికార ప్రతినిధి స్పష్టంచేశారు.

ఏంటా ఒప్పందం?

ధాన్యం కొనుగోళ్లు ఆపడం లేదని, అవగాహన ఒప్పందం ప్రకారం కొంటామని కేంద్రం ప్రకటించడంతో ఈ ఒప్పందం ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది సెప్టెంబరు 8న భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) తెలంగాణ పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు రాసిన లేఖలో దేశంలో మిగులు నిల్వలు ఉండడంతో పాటు, వినియోగం తక్కువ కావడంతో 2021-22వ మిల్లింగ్‌ సంవత్సరం నుంచి ఉప్పుడు బియ్యం కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. రైతులు ఇతర పంటలు వేసేలా ప్రోత్సహించాలని సూచించారు. అదే నెల 30వ తేదీన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు మరో లేఖ రాసింది. దీని ప్రకారం కూడా భవిష్యత్తులో ఎఫ్‌సీఐకి తెలంగాణ ఉప్పుడు బియ్యాన్ని సరఫరా చేయడానికి లేదని పేర్కొంది. గత రబీలో వచ్చిన ఉప్పుడు బియ్యాన్ని కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కేంద్రానికి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో సెప్టెంబరు 30న కేంద్రం ఈ మేరకు సమాధానం ఇచ్చింది. 2020-21లో యాసంగి పంటలో 24.75 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం తీసుకోవడానికి అంతకుముందు నిర్ణయించగా, తర్వాత అదనంగా 20 లక్షల మెట్రిక్‌ టన్నులు తీసుకోవడానికి అంగీకరించింది. అదనంగా తీసుకోవడానికి అంగీకరిస్తూనే భవిష్యత్తులో తీసుకోబోమని స్పష్టం చేసింది. తాజాగా విడుదల చేసిన ప్రకటనలో ఎంఓయూ గురించి ప్రస్తావించింది. 2019 అక్టోబరు 6న తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సవరించిన ఒప్పందం గురించి 2020 సెప్టెంబరు 17న  రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు కేంద్రం ఓ లేఖ రాసింది. ఈ ఒప్పందంలోని 18వ పాయింటు ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన బియ్యం రాష్ట్రంలోని ప్రజా పంపిణీ వ్యవస్థకు, ఇతర సంక్షేమ పథకాలకు పోను అదనంగా ఉన్నది ఎఫ్‌సీఐకి అప్పగించాలి. అయితే ఇలా అదనంగా సెంట్రల్‌ పూల్‌కు ఇచ్చే బియ్యం సాధారణమా లేక ఉప్పుడు బియ్యమా అన్నది ఎఫ్‌సీఐ చెబుతుంది. దేశంలో ప్రజాపంపిణీ  వ్యవస్థ అవసరాలను పరిగణనలోకి తీసుకొని ఏ రకం బియ్యం మిల్లింగ్‌ చేయాలో చెబుతుంది. ఒక వేళ తెలంగాణ అవసరాలకు తగ్గితే  ఆమేరకు ఎఫ్‌సీఐ ద్వారా రాష్ట్రానికి ఇస్తుందని పేర్కొంది. దీని ప్రకారం చూసినా, సెప్టెంబరు 30న కేంద్రం రాసిన లేఖలో తెలంగాణ నుంచి ఉప్పుడు బియ్యం తీసుకోమని స్పష్టం చేసినందున ఇక అవకాశం లేనట్లేనన్న అభిప్రాయాన్ని సంబంధిత వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని