Published : 28/11/2021 05:13 IST

జంట నగరాల్లో తగ్గిన ఆర్టీసీ పార్సిల్‌ ఛార్జీలు

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాల్లో పార్సిల్‌ ఛార్జీలను భారీగా తగ్గించింది. వినియోగదారులకు మరింత చేరువ అవ్వాలన్న ఉద్దేశంతో ఆర్టీసీ ఇటీవల జంట నగరాల్లో హోం డెలివరీ విధానాన్ని ప్రారంభించింది. అప్పట్లో నిర్ణయించిన ఛార్జీలను సవరించిన సంస్థ.. కొత్త ఛార్జీలు తక్షణం అమలులోకి వస్తాయని ప్రకటించింది. కిలో నుంచి 10 కిలోల లోపు ఉన్న పార్సిళ్లకు గతంలో రూ.80 వసూలు చేసేది. ఆ మొత్తాన్ని రూ.55కు తగ్గించింది. 11 నుంచి 30 కిలోల ఛార్జీ రూ.150 నుంచి రూ.90కి, 31 నుంచి 50 కిలోల ఛార్జీ రూ.225 నుంచి రూ.130కి, 51 నుంచి 100 కిలోల ఛార్జీ రూ.300 నుంచి 180కి తగ్గాయి. అలాగే, 500 గ్రాముల లోపు ఉన్న పార్సిల్‌ కవర్ల ఛార్జీలను రూ.30 నుంచి రూ.15కు, 1000 గ్రాముల(కిలో) లోపు కవర్ల ఛార్జీలను రూ.50 నుంచి రూ.25కు తగ్గించినట్లు పేర్కొంది.

30న ఆర్టీసీ రక్తదాన శిబిరం

రాష్ట్రవ్యాప్తంగా 65 ప్రాంతాల్లో ఈ నెల 30న రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకునేందుకు ఆరోగ్యవంతులైన ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులు రక్తదానం చేయవచ్చు అన్నారు. ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ, ప్రహరీ ట్రస్ట్‌ సహకారంతో నిర్వహిస్తున్న ఈ శిబిరం 30న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగుతుందన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని