గురుకులంలో కలకలం

రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పాఠశాలల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యక్తిగత దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం, వసతిగృహాలు, గురుకులాల్లో విద్యార్థులు గుమిగూడటం ఇందుకు

Published : 30 Nov 2021 04:56 IST

సంగారెడ్డిలో 48 మంది విద్యార్థులకు కొవిడ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని విద్యాసంస్థలు, పాఠశాలల్లో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వ్యక్తిగత దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించడంలో నిర్లక్ష్యం, వసతిగృహాలు, గురుకులాల్లో విద్యార్థులు గుమిగూడటం ఇందుకు కారణం. వారం రోజుల క్రితం శామీర్‌పేటలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో 25 కేసులు నమోదయ్యాయి. తాజాగా సంగారెడ్డిలోని బీసీ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థినికి జ్వరం రావడంతో తల్లిదండ్రులు కరోనా పరీక్ష చేయించారు. పాజిటివ్‌గా తేలడంతో పాఠశాలలోని విద్యార్థులందరికీ పరీక్షలు నిర్వహించగా 48 మందికి నిర్ధారణ అయింది. ఈ నెలలో ఇప్పటివరకు 570 విద్యాసంస్థల్లో 40 వేల మందికి నిర్వహించిన పరీక్షల్లో 240 మందికిపైగా విద్యార్థులు వైరస్‌ బారిన పడినట్లు తేలింది. విద్యార్థుల్లో లక్షణాలు కనిపించిన వెంటనే స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంతో సంప్రదించి పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారిని అక్కడే క్వారంటైన్‌లో ఉంచడంతో పాటు చికిత్స అందిస్తున్నారు.

రాష్ట్రంలో కొత్తగా 184 కరోనా కేసులు
రాష్ట్రంలో సోమవారం కొత్తగా 184 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,75,798కి చేరుకుంది. చికిత్స పొందుతూ ఒకరు చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 3,990గా నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 33,326 నిర్ధారణ పరీక్షలు జరిగాయి. కరోనా నుంచి సోమవారం మరో 137 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 6,68,227కు పెరిగింది. 3,581 మంది చికిత్సలో ఉన్నారు. తాజా జీహెచ్‌ఎంసీలో 70, సంగారెడ్డి జిల్లాలో 33 కేసులు నిర్ధారణ అయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని