9 నుంచి సింగరేణిలో మూడు రోజుల సమ్మె

సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ డిసెంబరు 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సోమవారం గోదావరిఖనిలో ...

Published : 30 Nov 2021 04:56 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను నిరసిస్తూ డిసెంబరు 9 నుంచి మూడు రోజుల పాటు సమ్మె చేయాలని సింగరేణి కార్మిక సంఘాలు నిర్ణయించాయి. సోమవారం గోదావరిఖనిలో తెబొగకాసంతో పాటు 5 జాతీయ కార్మిక సంఘాలు సమావేశమై సమ్మెపై చర్చించాయి. తెబొగకాసం ఇదివరకే సమ్మె నోటీసు జారీ చేయగా.. సోమవారం ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌ సంఘాల నాయకులతో ఆ సంఘం నాయకులు సమావేశమై 9, 10, 11 తేదీల్లో సమ్మె చేయాలని నిర్ణయించారు. తెబొగకాసం  డిమాండ్లతో పాటు మరో 11 అంశాలతో మంగళవారం మరో సమ్మె నోటీసు అందజేయాలని తీర్మానించారు. వారసత్వ ఉద్యోగాల వయోపరిమితి 40 ఏళ్లకు పెంపు, అలియాస్‌ పేర్లు సొంత పేర్లుగా మార్పు తదితర డిమాండ్లను నోటీసులో పేర్కొనాలని కార్మిక సంఘాల నాయకులు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని