మాదక ద్రవ్యాలపై పోలీస్‌ ‘డోపమ్స్‌’!

మాదకద్రవ్యాల నేరస్థుల కట్టడి కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌) చట్టం కేసుల సమాచారంతో కూడిన కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను నిఘా విభాగంలోని సీఐ సెల్‌ అధికారులు రూపొందించారు. డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌,

Published : 01 Dec 2021 04:36 IST

నిందితుల వివరాలతో సాఫ్ట్‌వేర్‌  రూపకల్పన
ప్రారంభించిన డీజీపీ మహేందర్‌రెడ్డి

డోపమ్స్‌ సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను ప్రారంభిస్తున్న డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులు

ఈనాడు, హైదరాబాద్‌: మాదకద్రవ్యాల నేరస్థుల కట్టడి కోసం రాష్ట్ర పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్సెస్‌(ఎన్‌డీపీఎస్‌) చట్టం కేసుల సమాచారంతో కూడిన కొత్త సాఫ్ట్‌వేర్‌ అప్లికేషన్‌ను నిఘా విభాగంలోని సీఐ సెల్‌ అధికారులు రూపొందించారు. డ్రగ్‌ అఫెండర్స్‌ ప్రొఫైలింగ్‌, అనాలిసిస్‌ అండ్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌(డోపమ్స్‌)గా పిలిచే ఈ అప్లికేషన్‌లో ఎన్‌డీపీఎస్‌ కేసుల ప్రొఫైలింగ్‌, పర్యవేక్షణ, విశ్లేషణతో కూడిన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్‌స్టేషన్లలో నమోదైన కేసులు, అరెస్టయిన నిందితుల సమాచారాన్ని నిక్షిప్తం చేశారు. మాదకద్రవ్యాల రవాణా, విక్రయంతో సంబంధమున్న నేరస్థుల ప్రొఫైల్‌లను రూపొందించడం, వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఇందులో చేర్చుతారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల పోలీసులు ఈ సమాచారాన్ని వీక్షించే వీలు కల్పించారు. మాదకద్రవ్యాల ఉత్పత్తి, సరఫరా, అమ్మకం తదితర హాట్‌స్పాట్‌లను గుర్తించడం సులభమవుతుంది. ఈ అప్లికేషన్‌ను డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మంగళవారం ప్రారంభించారు. అదనపు డీజీపీలు జితేందర్‌, శివధర్‌రెడ్డి, ఐజీలు నాగిరెడ్డి, రాజేశ్‌, శివశంకర్‌రెడ్డి, బాలనాగాదేవి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని