జన్యు విశ్లేషణకు మరో 9 నమూనాలు

వేర్వేరు దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న 219 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో గురువారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌

Updated : 04 Dec 2021 06:04 IST

13 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు టిమ్స్‌లో చికిత్స

ఈనాడు, హైదరాబాద్‌: వేర్వేరు దేశాల నుంచి శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్న 219 మంది అంతర్జాతీయ ప్రయాణికుల్లో గురువారం కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. వీరిలో 9 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ వీరిలో ఉందా? లేదా? అని తెలుసుకోవడానికి వీరందరి నమూనాలను శుక్రవారం జన్యువిశ్లేషణ(జీనోమ్‌ సీక్వెన్సీ) కోసం ప్రయోగశాలకు పంపించారు. ఇప్పటికే 4 నమూనాలను పంపారు. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన మొత్తం 13 మందిని చికిత్స కోసం గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించారు. ఇప్పటివరకూ 909 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 896 మందికి నెగెటివ్‌గా తేలింది. వీరంతా యూకే, సింగపూర్‌ దేశాల నుంచి వచ్చినవారు. నెగెటివ్‌గా నిర్ధరణ అయినవారిని 2 వారాల పాటు ఇళ్ల వద్దనే వైద్యసిబ్బంది పరిశీలించనున్నారు. ఇప్పటివరకూ రాష్ట్రంలో తొలిడోసు కొవిడ్‌ టీకా 91 శాతం పూర్తి కాగా.. అత్యధికంగా రంగారెడ్డిలో 108, హైదరాబాద్‌ 106, మెదక్‌లో 100 శాతం చొప్పున నమోదైంది. తక్కువగా కొమురంభీం జిల్లాలో 77, సంగారెడ్డిలో 78 శాతం చొప్పున పంపిణీ జరిగింది. రెండో డోసుకొచ్చేసరికి రాష్ట్రంలో సగటున 48 శాతం మంది వేసుకున్నారు. అతి తక్కువగా కుమురంభీం జిల్లాలో 16 శాతం మంది పొందారు. 


ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో సీఎస్‌ సమీక్ష 

వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌, వైద్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు తదితరులు శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో పర్యటించారు. వైద్యశాఖ అధికారులు, సిబ్బందితో భేటీ అయి, టీకాల పంపిణీ వేగవంతంగా పూర్తి చేయడానికి అనుసరించాల్సిన ప్రత్యేక కార్యాచరణపై మార్గనిర్దేశం చేశారు. ఈనెలాఖరులోగా అన్ని జిల్లాల్లో రెండు డోసులూ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేశారు.


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని