దేశంలో కొత్తగా 2.64 లక్షల కేసులు

దేశంలో కరోనా మూడో దశ మరింత ఉగ్రరూపం దాల్చింది. కొత్తగా 2,64,202 మంది మహమ్మారి బారిన పడ్డారు. కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి ఎగబాకింది. అనారోగ్యం తీవ్రమవడంతో మరో 315 మంది

Updated : 15 Jan 2022 06:07 IST

మరో 315 మంది మృతి

దిల్లీ: దేశంలో కరోనా మూడో దశ మరింత ఉగ్రరూపం దాల్చింది. కొత్తగా 2,64,202 మంది మహమ్మారి బారిన పడ్డారు. కేసులు పెరుగుతుండటంతో రోజువారీ పాజిటివిటీ రేటు 14.78 శాతానికి ఎగబాకింది. అనారోగ్యం తీవ్రమవడంతో మరో 315 మంది మృతిచెందారు. 24 గంటల వ్యవధిలో నమోదైన ఈ గణాంకాలను కేంద్ర ఆరోగ్యశాఖ శుక్రవారం ఉదయం వెల్లడించింది.

మరణాలపై కథనాలు అవాస్తవం: కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో మొదటి, రెండు దశల్లో సంభవించిన కరోనా మరణాలను ప్రభుత్వం చాలా తక్కువచేసి చూపిందన్న మీడియా కథనాలను కేంద్ర ఆరోగ్యశాఖ తోసిపుచ్చింది. అవగాహన లేకుండా, మోసపూరితంగా రాసిన కథనాలుగా వీటిని పేర్కొంది. ‘‘తొలి రెండు దశల్లో సుమారు 30 లక్షల మంది కొవిడ్‌ కారణంగా మరణించి ఉంటారనడం పూర్తిగా తప్పు. జనన మరణాల వివరాలు ఎప్పటికప్పుడు గ్రామపంచాయతీ స్థాయి నుంచి జిల్లా, రాష్ట్రస్థాయి వరకూ నమోదవుతున్నాయి. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తోంది. అంతర్జాతీయంగా ఆమోదయోగ్యమైన రీతిలోనే కొవిడ్‌, సహజ మరణాల వర్గీకరణ జరుగుతోంది. ఏరోజు ఎంతమంది మృతిచెందారన్నది రాష్ట్ర ప్రభుత్వాలు నివేదిస్తున్నాయి’’ అని ఆరోగ్యశాఖ పేర్కొంది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు