హెలికాప్టర్‌ ప్రమాదం విద్రోహ చర్య కాదు

భారత తొలి త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా మొత్తం 14 మంది దుర్మరణం పాలైన హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఏదీ లేదని త్రివిధ దళాల కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ప్రాథమికంగా నిర్ధారించింది. గతేడాది డిసెంబరు 8న చోటుచేసుకున్న ఆ

Updated : 15 Jan 2022 06:00 IST

కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీలో ప్రాథమికంగా నిర్ధారణ

దిల్లీ: భారత తొలి త్రిదళాధిపతి జనరల్‌ బిపిన్‌ రావత్‌ సహా మొత్తం 14 మంది దుర్మరణం పాలైన హెలికాప్టర్‌ ప్రమాదం వెనుక కుట్ర కోణం ఏదీ లేదని త్రివిధ దళాల కోర్ట్‌ ఆఫ్‌ ఎంక్వైరీ ప్రాథమికంగా నిర్ధారించింది. గతేడాది డిసెంబరు 8న చోటుచేసుకున్న ఆ దుర్ఘటన.. విద్రోహ చర్య కాదని తేల్చింది. ఈ మేరకు వాయుసేనకు తాజాగా నివేదికను సమర్పించింది. మెకానికల్‌ వైఫల్యం, నిర్లక్ష్యం కూడా ప్రమాదానికి కారణాలు కావని అందులో పేర్కొంది. వాతావరణం ఆకస్మికంగా మారడంతో పైలట్‌ నియంత్రణ కోల్పోయారని వెల్లడించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని