విద్యాసంస్థలకు సెలవులు 30 వరకు పొడిగింపు

రాష్ట్రంలో వైద్యకళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు (జీవో నం.4) జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున

Published : 17 Jan 2022 05:48 IST

వైద్యకళాశాలలకు మినహాయింపు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వైద్యకళాశాలలు మినహా అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థల సెలవులు పొడిగిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు (జీవో నం.4) జారీ చేసింది. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు ఈ ఉత్తర్వులు ఇచ్చినట్లు సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ తెలిపారు. ఈ నెల తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో 8 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే. ఆదివారంతో ఈ గడువు ముగిసింది. అయితే రాష్ట్రంలో ఇంకా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కొంతకాలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించరాదని వైద్యఆరోగ్యశాఖ సిఫార్సు చేయగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని