ఏపీలో యథావిధిగా పాఠశాలలు

ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ఏదీ లేదని... ఇంతకుముందు ప్రకటించినట్లే సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు

Published : 17 Jan 2022 04:16 IST

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు పొడిగించే ఆలోచన ఏదీ లేదని... ఇంతకుముందు ప్రకటించినట్లే సోమవారం నుంచి యథావిధిగా పాఠశాలలు తెరుచుకుంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్య భద్రతతో పాటు భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తుందన్నారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం ఆయన ఒక ప్రకటన జారీ చేశారు. ‘ఇప్పటికే ఉపాధ్యాయులకు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ పూర్తి చేశాం. 15-18 సంవత్సరాల మధ్య వయసున్న విద్యార్థుల్లో దాదాపు 92% మందికి వ్యాక్సిన్‌ ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పాఠశాలను యథావిధిగా నడపాలని ఆలోచిస్తూనే వారి ఆరోగ్య భద్రతపై డేగకన్నుతో నిఘా ఉంచింది. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూనే పాఠశాలలు నడిపేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అని మంత్రి వివరించారు. ఇప్పటికైతే పాఠశాలలకు సెలవులు ప్రకటించే ఆలోచన లేదని, భవిష్యత్తులో కేసుల తీవ్రతను బట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తామని విద్యామంత్రి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు