TS News: ఔషధాలను జనరిక్‌ పేర్లతోనే రాయాలి..వైద్యులకు టీఎస్‌ఎంసీ ఆదేశాలు

మందుల చీటీలో ఔషధాలను తప్పనిసరిగా జనరిక్‌ పేర్లతోనే రాయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ల పేర్లతో ఔషధాలను రాయకూడదని సూచించింది. ఈ విషయంపై ఇప్పటికే

Published : 18 Jan 2022 07:55 IST

ఈనాడు, హైదరాబాద్‌: మందుల చీటీలో ఔషధాలను తప్పనిసరిగా జనరిక్‌ పేర్లతోనే రాయాలని తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి(టీఎస్‌ఎంసీ) ఆదేశించింది. ఎట్టి పరిస్థితుల్లో బ్రాండ్ల పేర్లతో ఔషధాలను రాయకూడదని సూచించింది. ఈ విషయంపై ఇప్పటికే భారతీయ వైద్య మండలి స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందని గుర్తుచేసింది. ఇదే అంశంపై ఇటీవల లోకాయుక్త కూడా ఆదేశాలిచ్చిందని పేర్కొంది. ‘భారతీయ వైద్య మండలి, లోకాయుక్త ఆదేశాలను బుట్టదాఖలు చేస్తూ కొందరు వైద్యులు బ్రాండ్ల పేర్లతోనే చీటీలు రాస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇక మీదట ఇలాంటివి సహించం. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులందరూ ఇకపై జనరిక్‌ పేర్లతోనే ఔషధాలను రాయాలని’ స్పష్టంచేస్తూ టీఎస్‌ఎంసీ రిజిస్ట్రార్‌ సీహెచ్‌.హనుమంతరావు తాజాగా ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని