పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి అక్కడ వచ్చే నెల 14న పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. దాని బదులు 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఏటా ఫిబ్రవరి 16న నిర్వహించే గురు

Published : 18 Jan 2022 04:27 IST

ఫిబ్రవరి 14కు బదులు 20న నిర్వహణ
ప్రకటించిన ఎన్నికల సంఘం
గురు రవిదాస్‌ జయంతి నేపథ్యంలో నిర్ణయం

ఈనాడు, దిల్ల్లీ: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. వాస్తవానికి అక్కడ వచ్చే నెల 14న పోలింగ్‌ జరగాల్సి ఉండగా.. దాని బదులు 20న ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది. ఏటా ఫిబ్రవరి 16న నిర్వహించే గురు రవిదాస్‌ జయంతి వేడుకలను పురస్కరించుకొని.. పంజాబ్‌ నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఉత్తర్‌ ప్రదేశ్‌లోని వారణాసికి దాదాపు వారం రోజుల ముందునుంచే తరలివెళ్తుంటారు. కాబట్టి ఫిబ్రవరి 14న పోలింగ్‌ నిర్వహిస్తే చాలామంది ఓటుహక్కు వినియోగించుకోలేకపోతారని.. ఎన్నికలను వాయిదా వేయాలని పంజాబ్‌ సీఎం చరణ్‌జీత్‌సింగ్‌ చన్నీతో పాటు భాజపా, ఇతర రాజకీయ పార్టీలూ ఈసీకి విన్నవించాయి. సానుకూలంగా స్పందించిన ఈసీ.. వాయిదా నిర్ణయాన్ని సోమవారం వెలువరించింది. ఫిబ్రవరి 20న ఉత్తర్‌ ప్రదేశ్‌లో మూడో విడత పోలింగ్‌ జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలు, ఉప ఎన్నికల షెడ్యూలును మార్చిన ఉదంతాలు గతంలోనూ ఉన్నాయని ఈసీ వర్గాలు వెల్లడించాయి. 2013లో మిజోరం అసెంబ్లీ ఎన్నికలు, 2014 ఏప్రిల్‌లో అదే రాష్ట్రంలో ఓ ఉప ఎన్నికతో పాటు 2012 మార్చిలో ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎన్నికల తొలి విడత తేదీలను మార్చిన సంగతిని గుర్తుచేశాయి.

కొత్త షెడ్యూల్‌ ఇదీ..
జనవరి 25 - ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల
ఫిబ్రవరి 1 - నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
ఫిబ్రవరి 2 - నామపత్రాల పరిశీలన
ఫిబ్రవరి 4 - నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు
ఫిబ్రవరి 20 - పోలింగ్‌ తేదీ
మార్చి 10 - ఫలితాల వెల్లడి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని