గిడ్డంగుల సంస్థలోనూ ఎఫ్‌డీల గోల్‌మాల్‌?

రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రూ.3.98 కోట్లు గోల్‌మాల్‌ అయినట్లు తెలిసింది. నాంపల్లిలోని గాంధీభవన్‌ వెనుక ఉండే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ గతేడాది జనవరిలో రూ.1.99 కోట్ల

Published : 19 Jan 2022 03:12 IST

తెలుగు అకాడమీ కేసులో వారి పనేనని అనుమానం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌కు చెందిన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో రూ.3.98 కోట్లు గోల్‌మాల్‌ అయినట్లు తెలిసింది. నాంపల్లిలోని గాంధీభవన్‌ వెనుక ఉండే తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ గతేడాది జనవరిలో రూ.1.99 కోట్ల చొప్పున యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కార్వాన్‌ శాఖలో డిపాజిట్‌ చేసింది. ఏడాది పూర్తైన సందర్భంగా ఎఫ్‌డీలకు సంబంధించి నగదు ఇవ్వాలంటూ గిడ్డంగుల సంస్థ ప్రతినిధి కొద్దిరోజుల క్రితం బ్యాంక్‌కు వెళ్లి రశీదులను చూపారు. బ్యాంక్‌ మేనేజర్‌ వాటిని పరిశీలించి.. అవి నకిలీవని తెలిపారు. నాలుగురోజుల క్రితం హైదరాబాద్‌ సెంట్రల్‌ క్రైమ్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నకిలీ రశీదులను గిడ్డంగుల కార్పొరేషన్‌ అధికారులు చూసుకోలేదా? బ్యాంక్‌ అధికారుల్లో ఎవరైనా అసలు రశీదులను తమ వద్ద ఉంచుకుని నకిలీవి గిడ్డంగుల కార్పొరేషన్‌ ప్రతినిధులకు ఇచ్చారా అని పోలీసులు పరిశోధిస్తున్నారు. తెలుగు అకాడమీకి చెందిన రూ.64 కోట్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు స్వాహా చేసిన నిందితులే ఇక్కడా గోల్‌మాల్‌ చేసి ఉండొచ్చనే కోణాన్నీ పరిశీలిస్తున్నారు. ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు చేసినప్పుడు బ్యాంక్‌ మేనేజర్‌గా మస్తాన్‌వలి (తెలుగు అకాడమీ ఎఫ్‌డీల కేసులో నిందితుడు) ఉన్నట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఆయనకు దీంతో సంబంధం ఉందా? ఎఫ్‌డీలను ఎవరైనా నగదుగా మార్చుకున్నారా? అన్న అంశాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని