కొత్తగా 2.38 లక్షల కేసులు

దేశంలో కొవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,38,018 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యం విషమించి మరో 310 మంది మృత్యువుపాలయ్యారు. దీంతో మొత్తం కేసులు 3,76,18,271కి

Published : 19 Jan 2022 03:14 IST

భారీగా పెరిగిన క్రియాశీలక కేసులు

దిల్లీ: దేశంలో కొవిడ్‌ కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 2,38,018 లక్షల కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యం విషమించి మరో 310 మంది మృత్యువుపాలయ్యారు. దీంతో మొత్తం కేసులు 3,76,18,271కి, మరణాలు 4,86,761కి చేరాయి. కొద్ది రోజులుగా కేసులు ఉద్ధృతంగా నమోదవుతుండటంతో ప్రస్తుతం ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్నవారి సంఖ్య 17,36,628కి పెరిగింది. జన్యు పరీక్షల్లో ఇప్పటివరకూ 8,891 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

15 ఏళ్లలోపు చిన్నారులకు ఇప్పుడే కాదు
15 ఏళ్లలోపు చిన్నారులకు టీకా పంపిణీ చేయనున్నట్టు వచ్చిన వార్తలను కేంద్ర ప్రభుత్వ వర్గాలు మంగళవారం తోసిపుచ్చాయి. 12-14 ఏళ్ల కౌమారులకు వ్యాక్సిన్‌ ఇచ్చే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని విస్పష్టం చేశాయి. ఈ వయసు చిన్నారులకు మార్చి 15 నుంచి వ్యాక్సిన్‌ పంపిణీ చేస్తామని జాతీయ కొవిడ్‌-19 వర్కింగ్‌ గ్రూప్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ ఎన్‌.కె.అరోడా సోమవారం పేర్కొనడంతో... చిన్నారులకూ వ్యాక్సిన్‌ అంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.


పరీక్షల సంఖ్య పెంచాలి: కేంద్ర ఆరోగ్యశాఖ

దేశంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల సంఖ్య తగ్గడంతో కేంద్ర ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వెంటనే పరీక్షల సంఖ్యను పెంచాలని, తద్వారా మహమ్మారి వ్యాప్తిని సమర్థంగా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందని రాష్ట్రాలకు సూచించింది. దేశంలో ప్రస్తుతం ఒమిక్రాన్‌ వ్యాప్తి ఉద్ధృతంగా ఉందని, విస్తృతంగా పరీక్షలు చేపట్టాలని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి ఆర్తి అహూజా రాష్ట్రాలు, యూటీలకు లేఖలు రాశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని