Published : 20 Jan 2022 05:06 IST

మృతులు 3,993..పరిహారం దరఖాస్తులు 28,969

తెలంగాణలో అధికారిక మరణాల కంటే ఏడింతలు అధికంగా క్లెయిములు

ఈనాడు, దిల్లీ: తెలంగాణలో అధికారికంగా నమోదైన కొవిడ్‌ మరణాల సంఖ్య కంటే ఏడింతల అధికంగా పరిహారం దరఖాస్తులు (క్లెయిములు) వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో ఈ విషయం వెల్లడైంది. జనవరి 16వ తేదీవరకు రాష్ట్రంలో నమోదైన కొవిడ్‌ మరణాలు 3,993 ఉండగా, క్లెయిములు 28,969 వచ్చాయి. అందులో 15,270 దరఖాస్తులను ఆమోదించి, 12,148 క్లెయిములకు చెల్లింపులు చేశారు. 1,489 వినతులను తిరస్కరించారు. ఆమోదం పొందని వాటిని రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ఫిర్యాదుల పరిష్కార కమిటీలు కూలంకషంగా పరిశీలించి, తిరస్కరణకు కారణాలేమిటో బాధితులకు చెప్పాలని బుధవారం జస్టిస్‌ ఎంఆర్‌షా, జస్టిస్‌ సంజీవ్‌ఖన్నాల నేతృత్వంలోని ధర్మాసనం తెలిపింది. అసంపూర్ణ సమాచారం, ఇతర లోపాలుంటే మళ్లీ దరఖాస్తులు సమర్పించుకునే అవకాశమివ్వాలని చెప్పింది. రాష్ట్రాల్లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లల వివరాలను జాతీయ బాలలహక్కుల కమిషన్‌ ఆధ్వర్యంలోని బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌ నుంచి తీసుకొని వారికి పూర్తిగా పరిహారం అందించాలని సూచించింది. అధికారికంగా మరణించిన తల్లిదండ్రులెందరు, బాల్‌స్వరాజ్‌ పోర్టల్‌లో నమోదైన సంఖ్య వివరాలను రాష్ట్ర లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీకి ఇవ్వాలని కూడా ధర్మాసనం చెప్పింది. అన్ని రాష్ట్రాలూ కొవిడ్‌ మరణాలు, క్లెయిములు, చెల్లింపుల వివరాలను కోర్టుకు సమర్పించాయి. అందులో మరణాలు, క్లెయిముల మధ్య అత్యధిక అంతరం గుజరాత్‌ (9 రెట్లు), తెలంగాణ (7 రెట్లు)ల్లోనే ఉంది. ఎక్కువ మరణాలు మహారాష్ట్రలో సంభవించినా, అక్కడ అధికారిక లెక్కలు, క్లెయిముల మధ్య తేడా (1.5) రెట్లు మాత్రమే నమోదైంది.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని