పెరిగిన డీఏ ఫిబ్రవరిలో చేతికి

తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు/పింఛనుదారులకు 10.01 శాతం కరవు భత్యం (డీఏ) పెంపుపై బుధవారం ఉత్తర్వులు (జీవో నం.3, 4) జారీ అయ్యాయి. 2021 జులై నుంచి ఈ పెంపుదల వర్తిస్తుంది. అప్పటి నుంచి డిసెంబరు వరకు ఉన్న బకాయిలను

Published : 20 Jan 2022 05:06 IST

2021 జులై నుంచి డిసెంబరు వరకు బకాయిలు జీపీఎఫ్‌లో జమ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులు/పింఛనుదారులకు 10.01 శాతం కరవు భత్యం (డీఏ) పెంపుపై బుధవారం ఉత్తర్వులు (జీవో నం.3, 4) జారీ అయ్యాయి. 2021 జులై నుంచి ఈ పెంపుదల వర్తిస్తుంది. అప్పటి నుంచి డిసెంబరు వరకు ఉన్న బకాయిలను ఉద్యోగులకు ప్రభుత్వం జీపీఎఫ్‌లో జమ చేస్తుంది. పెన్షనర్లకు బకాయిలను ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆరు నెలల్లో చెల్లిస్తుంది. ఈ నెల నుంచి వేతనం/పింఛనుతో పాటు పెరిగిన డీఏను ఉభయులకూ చెల్లిస్తారు. అంటే ఫిబ్రవరి నుంచి ఉద్యోగులు, పింఛనుదారుల చేతికందుతుంది. 2020 జనవరి నాటి డీఏ 3.64 శాతం, అదే సంవత్సరం జులై నాటిది 2.73 శాతం, 2021 జనవరి నాటిది 3.64 శాతం కలిపి మొత్తంగా 10.01 శాతం మంజూరైంది. తాజా పెంపుదలతో ఉద్యోగుల మూల వేతనంలో డీఏ 7.28 నుంచి 17.29 శాతానికి చేరింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, గ్రామ పంచాయతీలు, నగర, పురపాలికలు, ఎయిడెడ్‌ విద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికి, విశ్వవిద్యాలయాల బోధన, బోధనేతర సిబ్బందికి సైతం ఈ పెంపుదల వర్తిస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ ఉత్తర్వులపై పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని