గోనె సంచుల లెక్క.. పక్కా

ప్రతి సీజన్‌లో పెరుగుతున్న ధాన్యం దిగుబడుల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా గోనె సంచుల వినియోగం అదే స్థాయిలో ఉంటోంది. ఇందులో అక్రమాల నివారణకు పౌర సరఫరాల శాఖ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా తెరపైకి తెచ్చింది. ఇప్పటికే సిద్దిపేటలోని

Published : 20 Jan 2022 05:06 IST

ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట: ప్రతి సీజన్‌లో పెరుగుతున్న ధాన్యం దిగుబడుల దృష్ట్యా రాష్ట్రవ్యాప్తంగా గోనె సంచుల వినియోగం అదే స్థాయిలో ఉంటోంది. ఇందులో అక్రమాల నివారణకు పౌర సరఫరాల శాఖ క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని ప్రయోగాత్మకంగా తెరపైకి తెచ్చింది. ఇప్పటికే సిద్దిపేటలోని ఓ రైస్‌మిల్లులో పరిశీలన ప్రారంభమవగా.. జనగామ జిల్లాలోని కొడకండ్లలో త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సరస్వతీ రైస్‌మిల్లులో 10 వేల గోనె సంచులకు అధికారులు క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేశారు. వివిధ దశల్లో ధాన్యం, బియ్యం సంచులను ట్రాక్‌ చేసేందుకు వీలుగా స్కానర్లను అమర్చనున్నారు. దీని ద్వారా ధాన్యం, బియ్యం లెక్కలను ఎప్పటికప్పుడు అంచనా వేయవచ్చని అధికారులు చెబుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని