Updated : 21 Jan 2022 06:41 IST

అన్యోన్య దాంపత్యం.. అంతలోనే విషాదం

భార్య, కుమార్తెతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఆత్మహత్య

మృతదేహాల నుదుట బొట్లు.. చిందరవందరగా దేవునిపటాలు

మరణాలపై పలు అనుమానాలు

మృతులు శ్రీకాంత్‌గౌడ్‌, అనామిక, శ్రీస్నిగ్ధ

అమీన్‌పూర్‌, న్యూస్‌టుడే : భర్త టీసీఎస్‌లో ఉద్యోగి, భార్య కార్పొరేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. ఇద్దరూ ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.  ఏడేళ్ల కుమార్తె. సొంత ఇల్లు. అన్యోన్యంగా సాగుతున్న ఈ కుటుంబంలో హఠాత్తుగా పెను తుపాను. ఏమైందో ఏమో తెలియదుగానీ ఉన్నట్టుండి కుటుంబమంతా ఆత్మహత్య చేసుకుంది. మృతుల నుదుట బొట్లు..దేవుని గదిలో పటాలు చిందరవందరగా పడి ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. పనిమనిషికి రెండు రోజుల ముందే రావద్దని చెప్పడం గమనార్హం. సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌ పట్టణం బీరంగూడలో జరిగిన విషాదఘటనకు సంబంధించిన వివరాలు స్థానికులు, బంధువులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపల్‌ పరిధి పోతాయిపల్లికి చెందిన తిగుళ్ల శ్రీకాంత్‌గౌడ్‌ (42) పదేళ్ల క్రితం అల్వాల్‌ వెంకటాపురానికి చెందిన అనామిక(40)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి శ్రీస్నిగ్ధ (7) సంతానం. ఏడేళ్ల క్రితం బీరంగూడలోని వందనపురి కాలనీలో ఇల్లు కొనుగోలు చేసి ఇక్కడే ఉంటున్నారు. శ్రీకాంత్‌గౌడ్‌ ఉరి వేసుకుని మృతి చెందగా.. భార్య అనామిక, కూతురు శ్రీస్నిగ్ధ పురుగుల మందు తాగి నోటి నుంచి నురుగు, ముక్కుల నుంచి రక్తం వచ్చి మృతి చెందారు. ముందుగా శ్రీకాంత్‌ గౌడ్‌.. భార్యకు, కూతురికి విషం ఇచ్చి వారు చనిపోయిన తరువాత మృతదేహాలపై దుప్పటి కప్పి, అనంతరం వారిద్దరికీ పెద్ద బొట్లు పెట్టి తానూ పెట్టుకుని మరో గదిలోకి వెళ్లి ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.

రెండు రోజులుగా ఫోన్‌

అనామిక తండ్రి శ్రీరామచంద్రమూర్తి రెండు రోజులుగా ఫోన్‌ చేసినా సమాధానం లేకపోవడంతో ఆయన గురువారం కుమార్తె ఇంటికి వచ్చారు. లోపలి నుంచి గడియపెట్టి ఉంది. కిటికీలో నుంచి చూడగా శ్రీకాంత్‌గౌడ్‌ ఉరి వేసుకుని ఉన్నట్లు కనిపించగా ఆయన అమీన్‌పూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్‌ఐ రాజేందర్‌రెడ్డి తమ సిబ్బందితో అక్కడికి వచ్చి తలుపులు పగలగొట్టారు. మృతదేహాలను కనుగొన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేస్తున్నామని, కారణాలు తెలియరాలేదని సీఐ తెలిపారు. శ్రీకాంత్‌గౌడ్‌ తల్లిదండ్రులు బాల్‌రాజ్‌ గౌడ్‌, సత్తమ్మలు మాట్లాడుతూ.. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకునే పిరికివాడు కాదన్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని