Published : 22 Jan 2022 02:57 IST

ఆరు జిల్లాలకు అదనపు కలెక్టర్లు

పలువురు అధికారులకూ బదిలీలు  

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పలువురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. పోస్టింగ్‌ కోసం ఎదురుచూస్తున్న పలువురికి స్థానాలు కేటాయిస్తూ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ యు.రఘురాంశర్మను బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ సీఈవో కార్యాలయ పాలనాధికారిగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న కె.చంద్రమోహన్‌ను కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్‌గా నియమించారు. వికారాబాద్‌ జిల్లా అదనపు కలెక్టర్‌ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్యను బదిలీ చేసి ఖాళీగా ఉన్న హెచ్‌ఎండీఏ కార్యదర్శి స్థానంలో నియమించారు. రాష్ట్ర కో ఆపరేటివ్‌ రూరల్‌ ఇరిగేషన్‌ కార్పొరేషన్‌లో ఎండీగా పనిచేస్తున్న పి.రామచందర్‌ను నారాయణపేట ఆర్డీవోగా నియమించారు. ఆ స్థానంలో ఉన్న సీహెచ్‌ వెంకటేశ్వర్లును బదిలీ చేసినా, పోస్టింగ్‌ ఇవ్వలేదు.
* పలువురు స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లను (ఎస్‌జీడీసీ) జిల్లాల్లో అదనపు కలెక్టర్లుగా నియమించారు. బి.ఎస్‌.లత- జగిత్యాల, జి.పద్మజారాణి- నారాయణపేట, ఖీమ్యానాయక్‌- రాజన్న సిరిసిల్ల, వై.వి.గణేష్‌- ములుగు, కె.శ్రీవత్స- వరంగల్‌ గ్రామీణ, ఎం.డేవిడ్‌- మహబూబాబాద్‌లలో పోస్టింగ్‌లు ఇచ్చారు. నాగర్‌కర్నూల్‌ నుంచి శ్రీనివాస్‌రెడ్డిని సిద్దిపేటకు బదిలీ చేశారు.

* పలువురు డిప్యూటీ కలెక్టర్లకు స్థానాలు కేటాయించారు. కె.అనిల్‌ కుమార్‌ను చంచల్‌గూడ ప్రింటింగ్‌, స్టేషనరీ స్టోర్స్‌ కమిషనర్‌ కార్యాలయ పాలనాధికారిగా నియమించారు. బి.సంతోషిని హైదరాబాద్‌ జిల్లా భూ పరిరక్షణ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా, ఆర్‌.ఎస్‌.చంద్రావతిని మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా లా ఆఫీసర్‌గా, కె.వెంకట ఉపేందర్‌ రెడ్డిని మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఆర్డీవోగా నియమించారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని