ఏపీలో 14,440 మందికి కొవిడ్‌

ఏపీలో కొవిడ్‌ తీవ్రరూపం దాలుస్తోంది. జనవరి 10వ తేదీన పాజిటివిటీ 4శాతం ఉండగా, 23వ తేదీనాటికి 31 శాతానికి చేరింది. అంటే 14 రోజుల్లో 27 శాతం వరకు పెరిగింది. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం

Published : 24 Jan 2022 04:28 IST

ఈనాడు, అమరావతి: ఏపీలో కొవిడ్‌ తీవ్రరూపం దాలుస్తోంది. జనవరి 10వ తేదీన పాజిటివిటీ 4శాతం ఉండగా, 23వ తేదీనాటికి 31 శాతానికి చేరింది. అంటే 14 రోజుల్లో 27 శాతం వరకు పెరిగింది. శనివారం ఉదయం 9గంటల నుంచి ఆదివారం ఉదయం 9గంటల మధ్య 46,650 మందికి పరీక్షలు చేయగా.. 14,440 మందికి పాజిటివ్‌గా నిర్ధారించారు. గత ఆదివారంతో (15.22%) పోలిస్తే పాజిటివిటీ రెట్టింపు కాగా, కేసుల సంఖ్య కూడా 10వేల వరకు అధికంగా ఉంది. రాష్ట్రంలోనే అత్యధికంగా విశాఖపట్నంలో ఆదివారం 2,258 కేసులు నమోదయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని