
జాతీయత వెల్లివిరియాలి
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
దేశాభివృద్ధికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలి: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
సనత్‌నగర్, న్యూస్‌టుడే: జాతీయత భావనను భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని, అమృత్ మహోత్సవాలలో భాగంగా భారత్‌మాతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సనత్‌నగర్ హిందూ పబ్లిక్ స్కూల్ ఆవరణలో భారతమాత మహాహారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వర్చువల్ విధానంలో వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎక్కడికెళ్లినా భారతదేశం గొప్పదనాన్ని చాటిచెప్పాలనే రాయప్రోలు సుబ్బారావు గేయాన్ని ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. భారత్‌మాతా ఫౌండేషన్ ఆరేళ్లుగా నిర్వహిస్తున్న మహాహారతి కార్యక్రమం ఎంతో స్ఫూర్తివంతంగా సాగుతోందని ప్రశంసించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు జగ్గీ వాసుదేవ్ కూడా వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ‘‘ఎందరో మహనీయుల త్యాగం, బలి దానాలతో స్వాతంత్య్రం సిద్ధించింది. దేశాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుపోయేందుకు ప్రతీ ఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలి’’ అని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. మహా హారతిని వర్చువల్ విధానంలో వీక్షించేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. మహాహారతి కన్వీనర్ బూర్గుల శ్యామ్‌సుందర్, ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్ ఆఫీసర్ కపిల్ గోయల్ పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.