కొత్తగా 3,801 కొవిడ్‌ కేసులు

రాష్ట్రంలో కొత్తగా 3,801 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,47,155కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 4,078

Published : 27 Jan 2022 03:55 IST

కరోనాతో ఒకరి మృతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా 3,801 కొవిడ్‌ కేసులు నమోదు కాగా.. మొత్తం బాధితుల సంఖ్య 7,47,155కు పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరొకరు కన్నుమూయగా.. ఇప్పటి వరకూ 4,078 మంది మృతిచెందారు. తాజాగా 2,046 మంది కోలుకోగా.. మొత్తంగా 7,05,054 మంది ఆరోగ్యవంతులయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 38,023 మంది కరోనాతో చికిత్స పొందుతున్నారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 88,867 నమూనాలను పరీక్షించారు. మరో 5,433 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,570.. రంగారెడ్డిలో 284, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 254, హనుమకొండలో 147, ఖమ్మంలో 139, సిద్దిపేటలో 96, సంగారెడ్డిలో 88, మహబూబ్‌నగర్‌లో 86, కరీంనగర్‌లో 79, భద్రాద్రి కొత్తగూడెంలో 78, వరంగల్‌లో 75, నల్గొండలో 70, మంచిర్యాలలో 67, నిజామాబాద్‌లో 62,  సూర్యాపేటలో 59, జగిత్యాలలో 55, పెద్దపల్లిలో 51, యాదాద్రి భువనగిరి జిల్లాలో 51 చొప్పున కొత్త పాజిటివ్‌లు నిర్ధారణ అయ్యాయి.

ఏపీలో 13,618 మందికి కొవిడ్‌

ఏపీలో రెండోరోజూ కొవిడ్‌ కేసులు స్వల్పంగా తగ్గాయి. మంగళవారం ఉదయం 9 నుంచి బుధవారం ఉదయం 9 గంటల మధ్య 49,143 నమూనాలు పరీక్షించారు. వీటిద్వారా 13,618 కొవిడ్‌ కేసులు గుర్తించారు. పాజిటివిటీ రేటు 27.7%గా నమోదైంది. మంగళవారం పాజిటివిటీ రేటు 29.44%గా ఉంది. కొవిడ్‌తో 9 మంది మరణించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని