
రాష్ట్రంలో మరణించిన ఓటర్లు 1.64 లక్షల మంది?
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా 1,64,678 మంది ఓటర్లు మరణించగా జాబితా నుంచి వారి పేర్లను తొలగించారు. భారత ఎన్నికల సంఘం ఏటా ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం నిర్వహిస్తుంది. ఆ కసరత్తు పూర్తిచేసి ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల తుది జాబితా ప్రకటించింది. విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్, యాకుత్‌పుర, చాంద్రాయణగుట్ట, గోషామహల్, కార్వాన్, నాంపల్లి, జూబ్లీహిల్స్, మలక్‌పేట, మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓటర్లు మరణించలేదు. మేడ్చల్, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, చార్మినార్ నియోజకవర్గాల్లో ఇద్దరు చొప్పున, ముషీరాబాద్‌లో ఒకరు చనిపోయారు. కేసులు తదితర కారణాలతో మొత్తం 368 మంది ఓటు హక్కు కోల్పోయారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.