Bharat Biotech‌: భారత్‌ బయోటెక్‌ చుక్కలటీకాకు మూడోదశ పరీక్షలు

కొవిడ్‌ వ్యాధికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘బీబీవీ 154’ అనే చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి భారత....

Updated : 29 Jan 2022 04:49 IST

డీసీజీఐ అనుమతి

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ వ్యాధికి దేశీయ ఔషధ దిగ్గజ సంస్థ భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన ‘బీబీవీ 154’ అనే చుక్కల మందు టీకా (నాసల్‌ వ్యాక్సిన్‌) మూడో దశ క్లినికల్‌ పరీక్షలు నిర్వహించడానికి భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) అనుమతి ఇచ్చింది. ప్రాథమికంగా ఇచ్చే రెండు డోసులతో పాటు, బూస్టర్‌కు అనువుగా క్లినికల్‌ పరీక్షలు నిర్వహిస్తారు. టీకా ఇవ్వటం, నిల్వ, పంపిణీలో ఉన్న సౌకర్యాలను పరిగణనలోకి తీసుకుంటే చుక్కల మందు టీకా ఎంతో మేలైనది అవుతుందని భారత్‌ బయోటెక్‌ సీఎండీ డాక్టర్‌ కృష్ణ ఎల్ల గతంలో పేర్కొన్నారు. దీనికి సిరంజి, సూదుల అవసరం ఉండదు. త్వర త్వరగా టీకాలు ఇవ్వొచ్చు. మూడో దశ క్లినికల్‌ పరీక్షలు మూడు నెలల్లో పూర్తవుతాయని తెలుస్తోంది. ఆ తర్వాత దీన్ని వినియోగించడానికి అనుమతి లభిస్తే, కరోనా వ్యాధికి అందుబాటులోకి వచ్చిన చుక్కల మందు టీకా ఇదే అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని