Telangana: రిజిస్ట్రేషన్ల రాబడి రూ.10,000 కోట్లు

రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే రూ. 10,000 కోట్లకు చేరింది. రెండుసార్లు మార్కెట్‌ విలువలు పెంచినా, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలను సవరించినా

Published : 26 Feb 2022 05:43 IST

రాష్ట్రం ఏర్పడ్డాక ఇదే అత్యధికం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల రాబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. 2021-22 ఆర్థిక సంవత్సరం మరో నెల మిగిలి ఉండగానే రూ. 10,000 కోట్లకు చేరింది. రెండుసార్లు మార్కెట్‌ విలువలు పెంచినా, రిజిస్ట్రేషన్‌ ఛార్జీలు, స్టాంపు డ్యూటీలను సవరించినా లావాదేవీల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈ ఏడాది రెండోసారి పెంచిన మార్కెట్‌ విలువలు ఈ నెల 2 నుంచి అమల్లోకి వచ్చాయి. దీనివల్ల మొదటివారంలో రిజిస్ట్రేషన్లు కొంత మందగించినా తర్వాత పుంజుకున్నాయి. ఈ సంవత్సరం రిజిస్ట్రేషన్ల శాఖ రాబడి అంచనాలు రూ. 12,500 కోట్లు కాగా ఇప్పటికి వ్యవసాయ భూముల ద్వారా రూ. 1,300 కోట్లు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 8,700 కోట్లు వచ్చాయి. ఆర్థిక సంవత్సరం ముగిసేసరికి అంచనాలను అందుకోవచ్చని భావిస్తున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రిజిస్ట్రేషన్లలో ఇదే అత్యధిక రాబడి. గతంలో గరిష్ఠంగా 2019-20లో రూ. 7,061 కోట్లు వచ్చింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని