సీఎం కేసీఆర్‌ మోసాలకు కొదవలేదు

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం మోసపూరిత హామీలకు మాత్రం కొదవే లేదని ట్విటర్‌ వేదికగా సోమవారం వ్యాఖ్యానించారు.

Updated : 03 May 2022 05:43 IST

కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్ర పర్యాటకశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు. సీఎం మోసపూరిత హామీలకు మాత్రం కొదవే లేదని ట్విటర్‌ వేదికగా సోమవారం వ్యాఖ్యానించారు.‘తెరాస ఎనిమిదేళ్ల పాలనలో ఇంటికో ఉద్యోగం లేదు. నిరుద్యోగ భృతి లేదు. ఉచిత ఎరువులు లేవు. రుణమాఫీ లేదు. దళిత ముఖ్యమంత్రి లేదు. దళితులకు మూడెకరాల భూమి లేదు. దళితబంధు లేదు. బీసీ బంధు అసలే లేదు. డబుల్‌ బెడ్రూం అందరికీ లేదు’ అంటూ కిషన్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. ‘పార్టీ ఫిరాయింపులకు అడ్డూ అదుపు లేదు. తెలంగాణ విమోచన దినోత్సవం జరిపేది లేదు. అప్పులకు లెక్క లేదు. అబద్ధాలకు అంతం లేదు. అక్రమ కేసులకు న్యాయం లేదు. కేజీ నుంచి పీజీ ఉచిత విద్య అమలే లేదు. కుటుంబ పాలనకు అడ్డే లేదు. తెలంగాణ విద్యావంతులకు విలువ లేదు. నిజాం చక్కెర ఫ్యాక్టరీ తెరిచేది లేదు. కొత్త రేషన్‌ కార్డుల ఊసు లేదు. పింఛను కార్డుల జాడ లేదు. సామాజిక న్యాయం లేదు. సీఎం సచివాలయానికి వచ్చేది లేదు. ఉద్యమకారులకు గౌరవం లేదు. రైతులకు పంట నష్టపరిహారం లేదు. ధాన్యం కొనుగోలులో చిత్తశుద్ధి లేదు’ అంటూ తెరాస ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని