రుణ ఆంక్షలపై కేసీఆర్‌ అసంతృప్తి

రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఆంక్షలకు పూనుకోవడం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాసనసభను సమావేశపరిచి రుణ

Published : 19 May 2022 03:07 IST

కేంద్రంపై వ్యతిరేక గళం విప్పాలని నిర్ణయం  
శాసనసభ తీర్మానం చేయాలనే యోచన
నేడు దిల్లీకి ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రాలు తీసుకునే రుణాలపై కేంద్రం ఆంక్షలకు పూనుకోవడం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. దీనికి వ్యతిరేకంగా గళం విప్పాలని ఆయన నిర్ణయించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. శాసనసభను సమావేశపరిచి రుణ ఆంక్షలకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని యోచిస్తున్నట్లు సమాచారం. మరోవైపు సీఎం కూడా త్వరలో దిల్లీకి వెళ్లి దీనిపై పలు పార్టీల నేతలతో భేటీ కావాలని భావిస్తున్నారు. బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన పల్లె,పట్టణ ప్రగతి సమీక్ష సమావేశంలో తాను దిల్లీకి వెళ్లే విషయాన్ని సీఎం వెల్లడించినట్లు తెలిసింది. మరోవైపు సీఎం ఆదేశాల మేరకు గురువారం ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు దేశ రాజధానికి వెళ్తున్నారు. కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను కలిసి ఆంక్షలను ఎత్తివేయాలని కోరనున్నారు. ఇప్పటికే కేంద్ర ఆర్థికశాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. రాష్ట్రాలు తీసుకునే అప్పులపై ఆంక్షలను ఎత్తివేయాలని, బాండ్ల విక్రయం కోసం రుణానికి అనుమతించాలని ఆ లేఖలో పేర్కొంది. కేంద్ర నిర్ణయాల వల్ల అభివృద్ధి, సంక్షేమాలకు విఘాతం కలుగుతుందని వివరించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని