కాల్మొక్త సారూ... కనికరించరూ..!

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ గ్రామానికి చెందిన కొక్కల సంతోష్‌ వ్యవసాయ మోటారుకు విద్యుత్తు కనెక్షన్‌ కోసం రెండు సంవత్సరాల క్రితం డీడీ తీసి అధికారులకు అందజేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు

Updated : 20 May 2022 11:39 IST

న్యూస్‌టుడే, నిజాంసాగర్‌: కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలం వెల్గనూర్‌ గ్రామానికి చెందిన కొక్కల సంతోష్‌ వ్యవసాయ మోటారుకు విద్యుత్తు కనెక్షన్‌ కోసం రెండు సంవత్సరాల క్రితం డీడీ తీసి అధికారులకు అందజేశారు. ఆ తర్వాత కొద్ది రోజులకు సిబ్బంది ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసి విద్యుత్తు స్తంభాలు వేశారు. నెలలు గడిచినా కనెక్షన్‌ మాత్రం ఇవ్వడంలేదు. సమయానికి నీరందక తనకున్న రెండెకరాల్లోని పంటలు ఎండిపోతున్నాయని.. వెంటనే విద్యుత్‌ సౌకర్యం కల్పించాలని రైతు రోజుల తరబడి కార్యాలయం చుట్టూ తిరిగారు. అయినా ప్రయోజనం లేకపోవడంతో గురువారం కుటుంబంతో సహా నిజాంసాగర్‌ ఉపకేంద్రం వద్దకు వచ్చారు. చేత్తో పురుగుల మందు డబ్బా పట్టుకుని నిరసన తెలిపారు. వెంటనే చర్యలు తీసుకోవాలని సబ్‌ఇంజినీర్‌ ప్రదీప్‌ కాళ్లపై పడి మొక్కారు. ఆయన హామీ ఇవ్వడంతో ఇంటికి వెళ్లిపోయారు. దీనిపై ఏఈ లక్ష్మణ్‌ను వివరణ కోరగా.. విద్యుత్తు తీగలు లేకపోవడంతో పని ఆలస్యమైందని, నిజామాబాద్‌ నుంచి తీసుకువచ్చి వెంటనే కనెక్షన్‌ ఇస్తామని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని