Weather Forecast: తెలంగాణలో 4 రోజుల పాటు ఓ మోస్తరు వానలు

ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకూ ఉపరితల ద్రోణి రూపంలో గాలుల ప్రవాహం ఏర్పడింది. కర్ణాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది.

Published : 21 May 2022 10:01 IST

కోటిపల్లిలో 9.7 సెంటీమీటర్ల వర్షపాతం

ఈనాడు, హైదరాబాద్‌ : ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక దక్షిణ ప్రాంతం వరకూ ఉపరితల ద్రోణి రూపంలో గాలుల ప్రవాహం ఏర్పడింది. కర్ణాటకపై 3.1 కిలోమీటర్ల ఎత్తులో గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. వీటి ప్రభావంతో శనివారం నుంచి 4 రోజుల పాటు తెలంగాణలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ పసుపురంగు హెచ్చరిక జారీచేసింది. శుక్రవారం వికారాబాద్‌, రంగారెడ్డి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో కొన్నిచోట్ల భారీవర్షాలు కురిశాయి. అప్పటికప్పుడు ఏర్పడుతున్న క్యుములోనింబస్‌ మేఘాల వల్ల కొన్నిగంటల వ్యవధిలోనే కుంభవృష్టి మాదిరిగా భారీవర్షం కురుస్తోంది. శుక్రవారం పగలు వికారాబాద్‌ జిల్లా కోటిపల్లిలో 9.7 దుద్యాలలో 9.4 ధవళాపూర్‌లో 8.7, మదనపల్లిలో 6.2 ధారూర్‌లో 6.2, తాండూరులో 5.7, పుట్టపహాడ్‌లో 5.7, రంగారెడ్డి జిల్లా కసులాబాద్‌లో 5.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. శుక్రవారం పగలు అత్యధికంగా పెనుబల్లి(ఖమ్మం జిల్లా)లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉపరితల ద్రోణి గాలులతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత సాధారణంకన్నా ఆరేడు డిగ్రీలు తక్కువగా ఉంది. శుక్రవారం పగలు మహబూబ్‌నగర్‌లో అత్యధికంగా 31.5 డిగ్రీలుంది. ఈ వేసవి మే నెలలో ఇంత తక్కువగా పగటి ఉష్ణోగ్రత నమోదవడం ఇదే తొలిసారి. వర్షాలతో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. బంగాళాఖాతం నుంచి అరేబియా సముద్రం దక్షిణ ప్రాంతం వరకూ నైరుతి రుతుపవనాలు విస్తరించాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని