ప్రభుత్వ స్థలాల క్రమబద్ధీకరణకు యాప్‌

ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని నివాసముంటున్న వారికి ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ రాష్ట్రంలో మొదలైంది. మండలాల వారీగా జిల్లా కలెక్టర్లు బృందాలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే ఈ బృందాలకు ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన ఒక యాప్‌ను అందజేయనున్నారు.

Published : 21 May 2022 05:39 IST

సులువుగా ప్రక్రియ పూర్తయ్యేలా సాంకేతికత

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని నివాసముంటున్న వారికి ఆ స్థలాన్ని క్రమబద్ధీకరించే ప్రక్రియ రాష్ట్రంలో మొదలైంది. మండలాల వారీగా జిల్లా కలెక్టర్లు బృందాలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయిలోకి వెళ్లే ఈ బృందాలకు ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన ఒక యాప్‌ను అందజేయనున్నారు. ఆన్‌లైన్‌లో దాఖలైన దరఖాస్తులు ఈ యాప్‌లో తెరుచుకుంటాయి. విచారణ బృందం దరఖాస్తుదారుడి ఇంటికి వెళ్లి ఈ యాప్‌లో పూర్తి సమాచారాన్ని నమోదు చేస్తుంది. ఆన్‌లైన్‌లో చేసిన దరఖాస్తు ప్రకారం క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉందా లేదా అనేది పరిశీలించనుంది. ఆధారాలు, స్థలం ఫొటోను కూడా జత చేయడం జరుగుతుంది.

విస్తీర్ణం పెరిగితే జీవో ఎంఎస్‌.నం.59 కిందకు మార్పు

ప్రభుత్వ భూమిలో 125 చదరపు గజాల విస్తీర్ణంలోపు ఆక్రమించుకుని నివాసం ఏర్పాటు చేసుకున్న వారికి జీవో ఎంఎస్‌.నం.58 ప్రకారం ఉచితంగా క్రమబద్ధీకరణ చేపట్టనున్నారు. అంతకు మించితే జీవో ఎంఎస్‌.నం.59 కింద బాధితుల దరఖాస్తును మార్పు చేస్తున్నారు. ఈ సౌకర్యం కూడా యాప్‌లో కల్పించారు. ఈ జీవో ప్రకారం 125 నుంచి 250 గజాల మధ్య స్థలంలో నివాసముంటే రిజిస్ట్రేషన్‌ ధరలో 50 శాతం చెల్లించాలి. 500 గజాల వరకు ఉంటే రిజిస్ట్రేషన్‌ ధరలో 75 శాతం, ఆపైన ఉన్న స్థలంలో నివాసం ఏర్పరుచుకుని ఉంటే 100 శాతం రిజిస్ట్రేషన్‌ ధర చెల్లించాల్సి ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు