అన్నదాత శ్రమ.. చెదలపాలు!

ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకూ అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల వద్దే ఎదురు చూస్తున్నారు.

Published : 21 May 2022 05:39 IST

ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకునేందుకూ అన్నదాతలు అరిగోస పడుతున్నారు. రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పల వద్దే ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు తూకం వేసినా.. ఆ ధాన్యం మిల్లులకు తరలించేందుకు లారీలు రాక నాలుగు రోజులుగా కొనుగోలు కేంద్రాల్లోనే మూలుగుతోంది. ఈ క్రమంలో వడ్ల బస్తాలకు చెదలు పట్టి పలువురు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం లక్ష్మీదేవిపల్లిలోని కొనుగోలు కేంద్రంలో ఓ రైతుకు చెందిన ధాన్యం బస్తాలకు చెదలు వచ్చి వడ్లన్నీ సంచుల్లోంచి కిందపడిపోయాయి. చిత్రంలో మీరు చూస్తున్నది ఆ దైన్యతనే.

- న్యూస్‌టుడే, గంగాధర

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని