మెడ చుట్టూ మఫ్లర్‌.. శిరసుపై పడగ!

మెడ చుట్టూ ఈకల మఫ్లర్‌, తలపై పడగ మాదిరి ప్రత్యేకత.. ఈకల కుచ్చులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పక్షి ఓ పావురమే. తలపై ఈకల అమరిక ఫ్రాన్స్‌ దేశపు జాకోబిన్‌ సన్యాసులు

Published : 21 May 2022 05:39 IST

మెడ చుట్టూ ఈకల మఫ్లర్‌, తలపై పడగ మాదిరి ప్రత్యేకత.. ఈకల కుచ్చులతో ఎంతో ఆకర్షణీయంగా ఉన్న ఈ పక్షి ఓ పావురమే. తలపై ఈకల అమరిక ఫ్రాన్స్‌ దేశపు జాకోబిన్‌ సన్యాసులు ధరించే వస్త్రధారణను పోలి ఉండటంతో ఈ కపోతానికి జాకోబిన్‌ పావురమనే పేరు వచ్చింది. దీని జన్మస్థలం భారతదేశమే. ఇవి బేలగా కన్పిస్తూ, చూపరులను ఉల్లాసపరుస్తాయని, అప్పుడప్పుడు విచిత్రంగా ప్రవర్తిస్తాయని జడ్చర్లలోని డాక్టర్‌ బీఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల జీవశాస్త్ర సహాయ ఆచార్యులు బక్షి రవీందర్‌రావు తెలిపారు. సికింద్రాబాద్‌ రెజిమెంటల్‌ బజార్‌లో ఓ పెంపుడు జంతువుల విక్రయ దుకాణంలో కనిపించిందీ విలక్షణ కపోతం. 

- ఈనాడు, హైదరాబాద్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని