మురుగు కాల్వ కాదిది.. బైపాస్‌ రహదారి!

ఇక్కడ కనిపిస్తున్నది కాల్వ కాదు.. కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌ బైపాస్‌ రహదారి. ప్రధాన వరదకాల్వను మరమ్మతుల పేరిట నెలల కిందట తవ్వారు. మురుగు ప్రవాహాన్ని రహదారి మీదుగా మళ్లించి వదిలేశారు.

Published : 23 May 2022 04:16 IST

ఇక్కడ కనిపిస్తున్నది కాల్వ కాదు.. కరీంనగర్‌లోని గణేశ్‌నగర్‌ బైపాస్‌ రహదారి. ప్రధాన వరదకాల్వను మరమ్మతుల పేరిట నెలల కిందట తవ్వారు. మురుగు ప్రవాహాన్ని రహదారి మీదుగా మళ్లించి వదిలేశారు. నగరంలో భారీవర్షం పడితే వరద నీరంతా ఇక్కడి నుంచే వెళ్లాలి.. సకాలంలో పనులు పూర్తికాకపోతే కాలనీలు మునిగే ప్రమాదం పొంచి ఉంది. నిజానికి సీఎం ప్రత్యేక నిధులతో ఈ పనులను ఓ గుత్తేదారుకు అప్పగించగా ఆయన వాటిని అర్ధంతరంగా వదిలేశారు. ఫలితంగా ఆరు నెలలుగా పనులు నిలిచిపోయాయి. మళ్లీ స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద చేర్చి పనులను మరో గుత్తేదారుకు అప్పగించారు. వానాకాలం తరుముకొస్తున్న తరుణంలో ఈ పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని స్థానికులు అందోళన చెందుతున్నారు. 

- ఈనాడు, కరీంనగర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని