Updated : 22/11/2021 05:00 IST

CM KCR: దిల్లీలో సీఎం కేసీఆర్‌

ప్రధాని, కేంద్రమంత్రులతో భేటీకి అవకాశం
4 రోజుల పాటు అక్కడే
యాసంగి ధాన్యం సేకరణతో పాటు రాష్ట్ర సమస్యలపై చర్చ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు, ఏపీ పునర్విభజన చట్టంలోని హామీలు, నీటి వాటాల కేటాయింపుల్లో స్పష్టత తదితర విషయాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో మంత్రులు, ఉన్నతాధికారుల బృందం ఆదివారం సాయంత్రం దిల్లీకి చేరుకుంది. సాయంత్రం 4.30 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో సీఎంతో పాటు వ్యవసాయ, పౌరసరఫరాల శాఖల మంత్రులు నిరంజన్‌రెడ్డి, గంగుల కమలాకర్‌, రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ తదితరులు బయలుదేరి వెళ్లారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా, పౌరసరఫరాల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌లను కేసీఆర్‌ కలవనున్నట్లు తెలిసింది. రాష్ట్ర మంత్రులు తొలుత పీయూష్‌ గోయల్‌ను కలిసి చర్చిస్తారు.  అనంతరం సీఎం భేటీ అవుతారు. ప్రధాని మోదీని కలిసేందుకు సైతం సీఎం కార్యాలయం అనుమతి కోరింది. భేటీల నేపథ్యంలో శుక్రవారం వరకూ ముఖ్యమంత్రి దిల్లీలోనే ఉంటారని తెలిసింది. కాగా కేసీఆర్‌ సతీమణి శోభకు ఎయిమ్స్‌లో ఆరోగ్య పరీక్షల నేపథ్యంలో మంత్రి కేటీఆర్‌ ప్రస్తుతం దిల్లీలోనే ఉన్నారు. తన భార్య ఆరోగ్య పరీక్షల సమాచారాన్ని ఆదివారం రాత్రి సీఎం తెలుసుకున్నారు.

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని